ANR బయోపిక్.. నాగ్ మనసు మారింది !

ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది.  బాల‌కృష్ణ త‌న తండ్రి బ‌యోపిక్ ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని రూపొందించాడు. దాని ఫలితం ఎలా ఉన్నా.. తన తండ్రి బయోపిక్ తీయాలి. అందులో తాను నటించాలన్న కోరికని బాలయ్య తీర్చుకున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ అద్భుతంగా ఉందనే ప్రశంసలు వచ్చాయ్. కానీ కమర్షియల్ గా ఆడలేదు. ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న టైమ్ లోనే ANR బయోపిక్ ఎప్పుడు ? అనే చర్చ జరిగింది. అయితే త‌న తండ్రి జీవితం చాలా సూటిగా సాగిపోయింద‌ని, ఆయ‌న జీవితంలో కింద‌ప‌డ‌టం, లేవ‌డం వంటివేమీ లేవ‌ని అందుకే దాన్ని డ్ర‌మెటైజ్ చేయ‌డం కుద‌ర‌ద‌న్న‌ట్టుగా నాగార్జున స్పందించారు. దీంతో ANR బయోపిక్ ఉండదని అనుకున్నారు.

కానీ ఇప్పుడు నాగ్ స్వరంలో మార్పు వచ్చింది. త‌న తండ్రి బ‌యోపిక్ తీయాల‌నే ఉంద‌ని, అయితే పొర‌పాట్లు జ‌రుగుతాయేమో అనే భ‌యం ఉంద‌ని నాగ్ అంటున్నారు. అలాంటి భ‌యం ఉన్న‌ప్పుడే జాగ్ర‌త్త‌గా ప‌ని చేస్తామంటూ కూడా త‌నే ముక్తాయింపునిచ్చారు నాగార్జున‌. దీంతో ఏఎన్నార్ బయోపిక్ పై ఆశలు చిగురిస్తున్నాయి. ఇది అక్కినేని అభిమానులకు శుభవార్తగానే చెప్పవచ్చు. ఇక నాగ్ నటించిన వైల్డ్ డాగ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే నాగ్ విభిన్నంగా ట్రై చేశారని అభిమానులు చెప్పుకుంటున్నారు.