లైవ్ : ‘వకీల్ సాబ్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ పింక్ కి రిమేక్ ఇది. ఇందులో బిగ్ బీ అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కనిపించనున్నారు. శృతి హాసన్, అంజలి, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించారు. ఈ వారమే (ఏప్రిల్ 9) వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతోంది.
చిత్రబృందం, పరిమిత సంఖ్యలో అభిమానుల మధ్య ఈ ప్రీ రిలీజ్ వేడుక కొనసాగుతోంది. ఇంకా పవన్ వేదికకు చేరుకోలేదు. ఏ క్షణమైనా ఆయన ఎంట్రీ ఇవ్వొచ్చు. ఆయన రాకకోసం వేడుకకు హాజరైన అభిమానులు, టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ నోటి నుంచి వకీల్ సాబ్ విశేషాలని వినాలని ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం మీరు వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని లైవ్ లో చూసేయండీ.. !
