ఫ్యాన్స్ యందు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేరయా.. !

అందరు హీరోలకి అభిమానులు ఉంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ భక్తుల జాబితాలో నితిన్, హరీష్ శంకర్, బండ్ల గణేష్ లాంటి సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ఉంటారు. అయితే తాజాగా పవన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కు సంబంధించిన ఓ కొత్త విషయం చెప్పారు దర్శకుడు క్రిష్. తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు క్రిష్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. ‘ఫ్యాన్స్ యందు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేరయా’ అన్నారు. దానికి కారణం కూడా క్రిష్ చెప్పారు. పవన్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లంచ్ టైమ్ లో ట్విట్టర్ ఓపెన్ చేసి.. నోటిఫికేషన్ చూస్తుంటే.. ఓ 10 మంది షూటింగ్ చేస్తున్న లోకేషన్స్ లో ఎండ ఎలా ఉంది ? మా కల్యాణ్ ని జాగ్రత్తగా తీసుకోండని ట్విట్ చేశారు.

పవన్ అంటే అభిమానులకి అంతటి ప్రేమని అని చెప్పుక్కొచ్చారు. జనరగల్ గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ వెల్ జరుగుతుంటాయ్. ఇప్పుడు టాలీవుడ్ పవన్ కల్యాణ్ ఫిల్మ్ ఫెస్టివెల్ జరగబోతుంది. మొదటగా ‘వకీల్ సాబ్’ వస్తున్నాడు. హిట్ కొట్టబోతున్నాడు. ఈ కథని పవన్ దగ్గరకు తీసుకెళ్లి.. ఆయన సినిమా చేసేందుకు ఒప్పించిన దిల్ రాజుకు కృతజ్ఝతలు. సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అన్నారు క్రిష్