కర్ణాటకలో సంపూర్ణ లాక్‌డౌన్‌

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించడానికి కేంద్రానికి ఆసక్తిని కనబర్చడం లేదు. ఆ నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసినట్టు చెబుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పై స్పష్టమైన నిర్ణయం తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. 

కర్నాటకలో  కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గడంలేదు. నిన్న ఒక్కరోజే 44వేలకు పైగా కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. దీంతో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని సీఎం యడియూరప్ప యోచిస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ పెట్టాలా? వద్దా ? అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఆయన తెలిపారు. మరికాసేపట్లో కర్నాటకలో లాక్‌డౌన్‌ పై అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారమ్.