కరోనా ఎఫెక్ట్ : ఒలింపిక్స్ మరోసారి వాయిదా

కరోనా ఉదృతి నేపథ్యంలో ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌కు సైతం కరోనా ముప్పు తప్పేలా లేదు. వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఒలింపిక్స్ గతేడాదే జరగాలి. వైరస్ కారణంగానే వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జులైలో నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం జపాన్ నగరాల్లో కొవిడ్ ఉద్ధృతి ఎక్కువ అవుతుండటంతో ప్రభుత్వం కరోనా అత్యయిక స్థితిని పొడగించనుందని సమాచారం. కేసులు పెరగడంతో క్రీడలు జరగాల్సిన టోక్యో, ఒసాక, క్యోటో, హ్యోగో ప్రాంతాల్లో మే 11 వరకు అత్యయిక స్థితిని పొడగిస్తారని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.అత్యయిక స్థితిలో మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, థియేటర్లు, భారీ షాపింగ్ మాల్స్, క్రీడా మైదానాలను మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ఒలంపిక్స్ మరోసారి వాయిదా పడటం ఖాయమని సమాచారమ్.
