మహేష్ కోసం హాట్ బ్యూటీ

అనూహ్యంగా మహేష్-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ సినిమా సెట్టయిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న ఈ సినిమా ప్రారంభోత్సవం ఉండనుందని సమాచారమ్. ఇక ఈ సినిమా కోసం ‘పార్థూ’ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారంట. అతడులో మహేష్ బాబు పాత్ర పేరు పార్థూనే. ఇప్పుడు.. హ్యాట్రిక్ సినిమా కోసం అదే పేరుని టైటిల్ గా వాడబోతున్నట్టు తెలిసింది.

ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ హ్యాట్ బ్యూటీ దిశా పటానీని ని తీసుకొనే ఆలోచనలో ఉన్నారట. మ‌రో ఇద్ద‌రు ముగ్గురు పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు. వాస్తవానికి.. త్రివిక్రమ్ తదుపరి సినిమా తారక్ తో ఉండాల్సి ఉంది. కొన్ని కారణాల వలన ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడం.. మహేష్ తో హ్యాట్రిక్ సినిమా లైన్ లోకి రావడం జరిగింది.