సునీతని ఇబ్బంది పెట్టిన ఆ దర్శకుడు ఎవరు ?

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే గాయని సునీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని..  తన కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో గతంలో ఓ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న టైమ్ లో దర్శకుడు నుంచి ఎదురైన షాకింగ్ రియాక్షన్స్ గురించి తెలియజేశారు. 

“గతంలో ఓ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడం కోసం స్టూడియోకి వెళ్లాను. స్టూడియో లోపలకి వెళ్లగానే ఆ చిత్ర దర్శకుడు.. ‘సునీత మేడమ్ నేను మీకు పెద్ద అభిమానిని. నా సినిమాకి మీరు డబ్బింగ్ చెప్పడం నాకెంతో ఆనందంగా ఉందన్నాడు. కొన్ని సీన్లు డబ్బింగ్‌ చెప్పిన అనంతరం ఆయన నన్ను ‘సునీత గారు’ అని పిలవడం ప్రారంభించారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. మరికొద్దిసేపటి తర్వాత ‘సునీత’ అని పిలిచారు. అలా కొంత డబ్బింగ్‌ పూర్తయ్యే సరికి ఆయన నన్ను .. ‘అరేయ్‌, అమ్మా, బుజ్జి, కన్నా” అనడంతో నేను షాక్‌ అయ్యాను”అని చెప్పుకొచ్చారు. ఆ దర్శకుడు పేరు మాత్రం సునీత బయటికి చెప్పలేదు.