గ్రేట్ : రెప్పపాటులో ఆమెను ప్రమాదం నుంచి రక్షించాడు

కదులుతున్న రైలు లోంచి ప్లాట్‌ఫాం మీద ఉన్న యువతికి బ్యాగు ఇచ్చిన ఓ మహిళ తాను కూడా ప్లాట్‌ఫాంపై దిగేందుకు ప్రయత్నించింది. కాగా ప్రమాదవశాత్తు కిందపడ్డ ఆ మహిళ పట్టాలపై పడిపోబోయింది. ఆ సమయంలో అటుగా వచ్చిన సతీశ్ అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అది గమనించి రెప్పపాటులో ఆమెను ప్లాట్‌ఫాంపైకి లాగాడు.
ఏమాత్రం ఆలస్యమైనా ఆ మహిళకు ప్రమాదం సంభవించేదే. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. దక్షిణ మధ్య రైల్వేశాఖ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొంది. కానిస్టేబుల్ సతీశ్‌ను ప్రశంసించింది.
