ఆ ఐదు రాష్ట్రాల్లోనే కరోనా మరణాలు ఎక్కువ

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. పెరుగుతున్నాయి. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం ఆరోగ్యమంత్రిత్వశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు.
మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, బెంగళూరు, చెన్నై నగరాల్లో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయన్నారు. రోజువారీ కరోనా కేసుల్లో 2.4శాతం పెరుగుదల ఉందన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, దిల్లీ, హరియాణాలో ఎక్కువ కరోనా మరణాలు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో ఒక్క బెంగళూరు నగరంలో 1.49 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చెన్నైలో ఈ సంఖ్య 38వేలుగా ఉంది. కొలికోడ్, ఎర్నాకుళం, గురుగ్రామ్ జిల్లాల్లోనూ కరోనా కేసుల పెరుగుదల గణనీయంగా ఉందన్నారు.
