ఐపీఎల్ వాయిదా.. మరో ఆప్షన్ లేదు !

ఐపీఎల్ 2021 అంతర్థంగా వాయిదా పడింది. ఈ మెగా టోర్నీని వాయిదా వేయడం కన్నా మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ నాసర్ హుస్సేన్‌ అన్నాడు. 

“ఐపీఎల్‌ను వాయిదా వేయడం కన్నా మరో ప్రత్యామ్నాయం లేదు. బయో బుడగ బలహీన పడ్డాక అది తప్పదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇది క్రికెట్‌ కన్నా ఎక్కువ చర్చనీయాంశం అయ్యేది. ఆటగాళ్లు మూర్ఖులు, కఠినులు కారు. భారత్‌లో ఏం జరుగుతుందో వారికి తెలుసు. ప్రాణవాయువు, ఆస్పత్రుల్లో పడకల కోసం బతిమిలాడుతున్న దృశ్యాలు చూసి వారెలా ఆడగలరు. ప్రజలు మరణిస్తుంటే ఆటనెలా చూడగలరు. ఆటగాళ్లను నేను విమర్శించడం లేదు. ఏదేమైనా టోర్నీని వాయిదా వేయాల్సిందే. భారత్‌లో నిర్వహించడమే నిర్వాహకులు చేసిన తప్పు. ఆరు నెలల క్రితం యూఏఈలో వారు అద్భుతంగా లీగ్‌ను నిర్వహించారు” అని హుస్సేన్ అన్నారు.