ఈటెల.. లోకల్ రియాక్షన్ ఏంటీ ?

గులాభి పార్టీ నుంచి మరో కీలక నేతను సాగనంపే ప్రయత్నం విజయవంతం అయింది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ.. అన్నీ తానుగా స్వయంగా సీఎం కేసీఆర్ వ్యవహరించారనే విమర్శలొస్తున్నాయ్. కొడుకు కేటీఆర్ ను సీఎం చేయడంలో ఈటెల అడ్డు, తన తర్వాత సీనియర్ కావడం వలనో సమస్య, ఇదీగాక.. ఆయన గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ధిక్కార స్వరం నేపథ్యంలో.. స్కెచ్ వేసి మరీ.. ఈటెలని బదనాం చేయడం జరిగింది. ఆ వ్యవహారం సక్సెస్ ఫుల్ గా ముగిసింది కూడా.
ఇప్పుడు బంతి ఈటెల చేతిలో ఉంది. ఆయన ఏం చేయబోతున్నారు ? అన్నది ఆసక్తిగా మారింది. తన శైలికి తగ్గట్టుగానే ఏది తేల్చకుండా.. సమాలోచనలు, సలహాలు అంటూ.. ఈటెల మెల్లిగా ముందుకు పోతున్నారు. బుధవారం హుజూరాబాద్‌లోని తన నివాసంలో శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నేతలతో చర్చించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారని ఈటల తెలిపారు.
మరోవైపు ఈటెల ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్కటి.. పొగపెట్టిన బయటికి వెళ్లకుండా..
తెరాసలోనే కుక్కున పేనులా ఉండటం. తాజా ఈటెల వ్యవహార శైలి గమనిస్తే.. అందుకు ఆయన సిద్ధంగా లేరని అనిపిస్తోంది. రెండోది భాజాపాలో చేరడం. మూడోది కాంగ్రెస్ లో చేరడం. ఇక ఆఖరి ఆప్షన్.. కొత్తపార్టీ ఏర్పాటు. బీసీ నేతలు, ఉద్యమంలో పని చేసిన వారిని కలుపుకొని.. ఈటెల కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారమ్. మరీ.. ఈటెల ఏం నిర్ణయం తీసుకుంటారు ? అన్నది చూడాలి.
