ప్రభాస్ విలన్ల వేట.. నెక్ట్స్ లెవల్ లో !

యాక్షన్ సీక్వెన్సెస్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్క్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక హీరోయిజంని ఎలివేట్ చేయడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ దిట్ట. సలార్ కోసం వీరిద్దరు కలిశారు. ఇక యాక్షన్ కే యాక్షన్ చూపించబోతున్నారు. సలార్ లో బైక్ పై విలన్లను వెంటాడే సీన్స్ ఒకటి ఉందట. ఈ సీన్ లో ప్రభాస్‌ను నెక్ట్స్ లెవల్లో చూపించే ప్రయత్నంలో ప్రశాంత్ నీల్ ఉన్నాడని సమాచారమ్. ఇందుకోసం ఓ వింటేజ్ బైక్, కారును ప్రత్యేకంగా తయారు చేస్తున్నారట.
ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఆ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించనున్నారు. అప్పటిలోగా వింటేజ్ బైక్, కారు రెడీ కానున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతిహాసన్ నటిస్తున్నారు. అంతేకాదు.. కాజల్ అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుందని సమాచారమ్. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
