మరో స్టార్ హీరోయిన్’ని పట్టేసిన నితిన్

యంగ్ హీరో నితిన్ హీరోయిన్ల ఎంపికలో మంచి టేస్ట్ చూపిస్తున్నాడు. వరుసగా స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ‘అ ఆ’ కోసం నితిన్-సమంత జంటగా నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నితిన్ స్టార్ హీరోలన్నీ వదలడం లేదు. వరుసగా రష్మిక, కీర్తి సురేష్, రకుల్ లతో రొమాన్స్ చేసిన నితిన్.. ఇప్పుడు పూజా హెగ్దేని పట్టేశాడు. ఆయన తదుపరి సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని  నటించనుంది.

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నాడు. ‘నా పేరు సూర్య’ తర్వాత వంశీ చేయనున్న చిత్రమిది. ఈ సినిమా కోసం పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకున్నారు. నితిన్ సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంథాదూన్ రీమేక్ మాస్ట్రోను ఫినిష్ చేసిన తరువాత నితిన్ చేసేది ఈ సినిమానే.

ఇక ఒకే టైమ్ లో అటు ప్రభాస్ (రాధేశ్యామ్), ఇటు అఖిల్ (మోస్ట్ఎలిజబుల్ బ్యాచిలర్)తో రొమాన్స్ చేసిన పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు పూర్తి చేసేసి.. క్రేజీ ఆఫర్ ఒకటి అందుకుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాలో  హీరోయిన్ గా ఎంపికైంది. ఇక మహేష్ – త్రివిక్రమ్ సినిమా కోసం పూజా పేరు వినిపిస్తోంది. ఈలోపు నితిన్ సినిమాలో కనిపించనుంది. మొత్తంగా.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో నటిస్తూ.. మూడు పూవులు, ఆరు కాయలుగా పూజా కెరీర్ కొనసాగుతోంది.