కొత్త ట్విస్ట్ : మా ఎన్నికలు ఇప్పట్లో లేవ్

ఓ కోయిల ముందే కూసినట్టు.. మూడెళ్ల ముందు నుంచే ‘మా’ ఎన్నికల బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్. ఇందుకోసం యేడాది క్రితం నుంచే కసరత్తు చేసినట్టు తెలిపారు. తన ప్యానల్ ని ప్రకటించేశారు. ఇతర ప్యానల్ లో ఉన్న వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం దర్శకుడు పూరి జగన్నాథ్ ఆఫీసునే అడ్డగా చేసుకున్నాడు. ఒక్కొక్కరిని అక్కడికి పిలిపించి.. భోజనం పెట్టించి మాట్లాడుతున్నారు. తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఇంతలో ప్రకాష్ రాజ్ కి ఏదో తేడా కొట్టింది. వెంటనే ట్విట్టర్ వేదికగా మా ఎన్నికలు ఎప్పుడు ? అంటూ ప్రశ్నించాడు. దీనిపై లీగల్ అడ్వయిజరీ షాకింగ్ సమధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. టీఎస్‌ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌, 2001 ప్రకారం ఒక కార్యవర్గం ఎన్నికైన తర్వాత గరిష్ఠంగా ఆరేళ్ల కాలం ఉండొచ్చు. మా బైలాస్‌లో ఎక్కడా ఒక కార్యవర్గంఎన్నికైన తర్వాత నిర్దిష్టంగా ఇంతకాలం ఉండాలని లేదు. 28 ఏళ్లుగా ఉన్న సంప్రదాయం ప్రకారం ఒక కార్యవర్గం ఒక ఎన్నిక నుంచి మరొక ఎన్నిక దాకా కొనసాగుతుంది. కాబట్టి.. కొత్త కార్యవర్గం ఎన్నికై అధికారాలు చేపట్టే దాకా ప్రస్తుత కార్యవర్గం పూర్తి అధికారాలతో కొనసాగుతుంది” అని లీగల్‌ అడ్వైజర్‌ తన అభిప్రాయాన్ని తెలిపారని సమాచారమ్.