మహేష్ పక్కన నయన్.. కామెడీ చేస్తున్నారుగా.. !!

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో నయనతార హీరోయిన్ అంటూ వార్తలు వచ్చేసాయి. అయితే ఈ ప్రచారంపై జోకులు పేలుతున్నాయి. నయన్ ను మహేష్ సరసన తీసుకుంటే అక్క గానో, వదిన గానో అయి వుంటుంది అని జోక్ లు కట్ చేస్తున్నారు. చిరంజీవి చెల్లిగా లూసిఫర్ రీమేక్ లో నయన్ నటిస్తోంది. ఆమెను తీసుకువచ్చి మహేష్ సరసన హీరొయిన్ ను చేసేసారు నెటిజన్స్.
ఇప్పుడీ ఈ న్యూస్ పై జోకులు పేలుతున్నాయి. ఇక మహేశ్-త్రివిక్రమ్ సినిమా కోసం ‘ అల వైకుంఠపురములో’ టీమ్ మొత్తం రిపీట్ కానుంది. ఒక్క హీరో అల్లు అర్జున్ స్థానంలో మహేష్ వస్తాడు అంతే. మిగితాదంతా సేమ్ టు సేమ్. మహేష్ కి జంటగా పూజా హెగ్డే కనిపించనుంది. సీనియర్ నటీనటులు కూడా రిపీట్ కానున్నారు. టెక్నికల్ టీమ్ లో ఎలాంటి మార్పులు-చేర్పులు కూడా లేవట.
