కృతి ఖాతాలో మరో రెండు

తొలి సినిమాతోనే హిట్ కొట్టడం ఓ.. అదృష్టం. అయితే హీరోయిన్ కృతిశెట్టి తొలి సినిమాతోనే ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ‘ఉప్పెన’ తర్వాత ఆమె కోసం క్యూ కడుతున్నారు. మీడియం రేంజ్ హీరోలు, స్టార్ హీరోలు కూడా కృతిని కోరుకుంటున్నారు. తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే ఆమె రెండు సినిమాలకు ఓకే చెప్పేసింది.

ఇందులో రామ్ సినిమా ఒకటి. ఇప్పుడు మరో సినిమాలు కృతి ఖాతాలో పడినట్టు సమాచారమ్. యంగ్ హీరోలు నితిన్, నాగ చైతన్యల సరసన నటించబోతోంది. నితిన్ కొత్త దర్శకుడు శేఖర్ తో చేయబోయే సినిమాకు కృతి శెట్టినే హీరోయిన్. అలాగే కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో తయారయ్యే ‘బంగార్రాజు’లో చైతన్య పక్కన హీరోయిన్ గా కూడా కృతినే ఫైనల్ చేసారు.