టీటీడీకి భవ్య మరోసారి కోటి విరాళం

టాలీవుడ్ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి ఆనంద్ ప్రసాద్ టీటీడీకి కోటి రూపాయల విరాళం అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమం కోసం ఈ విరాళం ఇచ్చారు. తిరుమలలో అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసిన ఆనందప్రసాద్, కృష్ణకుమారి దంపతులు కోటి రూపాయల చెక్కును అందజేశారు. 

టీటీడీకి గతంలోనూ ఒకసారి ఇలాగే ఆనందప్రసాద్ కోటి విరాళం అందించారు. ఇది రెండోసారి. శౌర్యం, లక్ష్యం, వాంటెడ్, నీకు నాకు డాష్ డాష్,  లౌక్యం, సౌఖ్యం, శమంతకమణి,పైసా వసూల్, చెక్ సినిమాలని నిర్మించిన భవ్య ఆనంద్ ప్రసాద్ త్వరలో ఓ క్రేజీ హీరో ప్రాజెక్టును అనౌన్స్ చేయబోతున్నారు.