పవన్-హరీష్.. ఓ సటైర్ !

‘గబ్బర్ సింగ్’ సినిమాతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఆకలి తీర్చాడు దర్శకుడు హరీష్ శంకర్. పవన్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించేశాడు. పవన్ గర్జిస్తే ఎలా ఉంటుందో ఇండస్ట్రీకి చూపించాడు. ఇండస్ట్రీ రికార్డులని ‘గబ్బర్ సింగ్’ తిరగరాసింది. ఈ సినిమా తర్వాత.. పవన్ నుంచి అంత మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ మరోటి రాలేదు.
ఇప్పుడు మరోసారి పవన్-హరీష్ జట్టు కట్టబోతున్నారు. ‘గబ్బర్ సింగ్’ని మించిన సినిమా అవుతుందని పవన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వారి అంచనాలని మించేలా సినిమాని తీర్చిదిద్దాలనే కసితో హరీష్ ఉన్నారు. ‘ఈసారి ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు’ అంటూ.. కాన్సెప్ట్ పోస్టర్ లోనే చెప్పేశాడు హరీష్ శంకర్. అంటే.. వినోదంతో పాటు, సందేశాన్ని కూడా మిక్స్ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పేశాడు.
అయితే పవన్-హరీష్ ఇచ్చే సందేశం ఏమై ఉంటుందనే చర్చ మొదలైపోయింది. పాలిటిక్స్ ని టచ్ చేస్తారనే ప్రచారం ఉంది. కానీ అందులో నిజం లేదట. పవన్ పాత్రలో రెండు కోణాలుంటాయని, ఓ కోణంలో పవన్ పాత్ర చాలా జోవియల్‌గా ఉంటుందని, మరో కోణంలో పవన్ పాత్ర ప్రశ్నించడం మొదలెడుతుందని.. అదంతా విద్యావ్యవస్థని టార్గెట్ చేసే కోణంలో సాగుతుందని సమాచారం.
