టాలీవుడ్ నిర్మాతల అత్యవసర మీటింగ్.. ఎందుకంటే ?

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే థియేటర్స్ ఓపెనింగ్ కి అనుమతులు ఇచ్చింది. వందశాతం ఆక్యుపెన్సీతో రన్ చేసుకోవచ్చని చెప్పింది. ఇప్పుడు ఏపీలోనూ థియేటర్స్ కు అనుమతి లభించింది. కానీ 50శాతం ఆక్యుపెన్సీకిమాత్రమే అనుమతులు ఇచ్చారు. అక్కడ మరో సమస్య కూడా ఉంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లని బాగా తగ్గించేసింది. వకీల్ సాబ్ విడుదల టైమ్ లో ఈ తగ్గింపు చేశారు. మళ్లీ పెంచలేదు. ఇప్పుడీ..దీనిపై నిర్మాతలు అసంతృప్తితో ఉన్నారు.
ఈ విషయమై… నిర్మాతలంతా ఏపీ ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. దాంతో ఏపీ ప్రభుత్వం మరోమారు ఆలోచించి.. కొత్త సినిమాలు విడుదలయ్యేటప్పుడు రేట్లు పెంచుకునే విషయంలో కాస్త వెసులుబాటు ఇచ్చింది. కాకపోతే అది కూడా కాస్త గందరగోళంగానే ఉంది. అందుకే ఈ విషయమై.. ఇప్పుడు నిర్మాతలంతా అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ లో కీలకమైన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతలంతా హాజరయ్యారు. ఏం నిర్ణయం తీసుకుంటారు ? అన్నది చూడాలి.
