డెల్టా కంటే లామ్డా వేరియంట్ మరింత ప్రమాదకరం

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని సంతోషించేలోగా.. థర్డ్ వేవ్ వస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో డెల్టా వేరియెంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అతి త్వరలోనే దేశంలో థర్డ్ వేవ్ విజృంభణ మొదలు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తెలిసిందే. డెల్టా వేరియంట్‌ కంటే లామ్డా వేరియంట్ అంతకంటే ప్రాణాంతకమని మలేసియా ఆరోగ్య శాఖ తెలిపింది.

ఈ రకం ఇప్పటికే ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. గత నాలుగు వారాల్లో దాదాపు 30 దేశాల్లో దీన్ని గుర్తించారు. చిలి దేశంలో 31 శాతం కేసుల్లో ఈ రకం కనిపించింది. బ్రిటన్‌కు కూడా ఈ రకం వ్యాపించింది. లామ్డా వేరియంట్‌ను మొదట గుర్తించిన పెరూలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందిని తాజాగా మలేసియా ఆరోగ్యశాఖ ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే డెల్టా వేరియంట్‌ కంటే లామ్డానే మరింత ప్రాణాంతకమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.