‘మా’ ఫైట్ : కొట్టుకున్నారు.. కొరుక్కున్నారు !

‘మా’ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. సినీ ప్రముఖులంతా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటింగ్ సమయంలోనూ సినిమాలో మాదిరిగా అన్నీ రకాల ఎమోషన్స్ పండుతున్నాయి. అప్పుడే తిట్టుకుంటున్నారు.

అప్పుడు నవ్వుకుంటున్నారు. కౌగిలింతలు, షేక్ హ్యాండ్స్ కి ఇక కొదవే లేదు. 
మరోవైపు పరిస్థితి కొట్టుకునే వరకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. లోపల గొడవ గొడవ జరుగుతుందనే మాటలు బయటికి వినిపిస్తున్నాయి. అయితే లోపల నటి హేమ శివబాలాజీ చేయి కొరికిన వీడియో బిట్ ఒకటి బయటికొచ్చింది. దీనిపై శివబాలాజీని అడగగా.. అలాంటిదేమీ జరగలేదని దాటవేశారు. హేమ మాత్రం కొరికిన మాట నిజమే. లోపల ఒకరిని పట్టుకొని పది మంది కొడుతున్నారు. అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే.. శివ బాలాజీ అడ్డుగా ఉన్నారు. అందుకే కొరికానని చెప్పుకొచ్చారు. 

ఇక ఇప్పటికే సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌ తదితరులు ఓటు వేశారు. ఇప్పటి వరకు దాదాపు 300 ఓట్లు పోలయ్యాయి. ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఉండనుంది. రాత్రి 8గంటల లోపు ఫలితాలు వెలువడనున్నాయి.