శ్రీవారి సేవలో విజయ్ ఫ్యామిలీ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి దర్శనం చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. విజయ్ కి జంటగా అనన్య పాండే నటిస్తున్నది. పాన్ ఇండియా సినిమాగా లైగర్ తెరకెక్కుతోంది. పూరి-ఛార్మితో కలిసి కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇక లైగర్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే ప్రచారం జరుగుతున్నది. ఇదే నిజమైతే సుకుమార్ దర్శకత్వంలో విజయ్ తదుపరి సినిమా ఉండనుంది.

