మా ఎన్నికలు : ఓటేసిన పవన్.. ఏమన్నాడంటే ?

మా’ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సినీ ప్రముఖులంతా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్ తదితరులు ఓటు వేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. కానీ ఎవరికి ఓటు వేశానని చెప్పడానికి ఆయన నిరాకరించారు.
తాను ఎవరికి మద్దతుగా నిలిచానో చెప్పడం ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని పవన్ అన్నారు. అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు స్నేహితులని, రాజకీయాలపై ‘మా’ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపవని అన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఇంత హడావుడి అవసరం లేదన్నారు. ఈ ఎన్నికల వల్ల సినీ ఇండస్ట్రీ చీలిపోవడమనేది ఉండదని చెప్పారు.
పవన్ తన ఓటు ఎవరికి అనే విషయం బయటికి చెప్పకపోయినా.. మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ ని సపోర్టు చేస్తున్న నేపథ్యంలో పవన్ ఓటు.. కూడా ఆయనకే పడి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు.. ప్రకాష్ రాజ్ కోసం పవన్ తన భక్తుడు బండ్ల గణేష్ ని కూడా దారిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ స్థాయిలో రచ్చ ఎప్పుడూ జరగలేదు: #PawanKalyan about MAA Elections – TV9
WATCH MAA Elections 2021 LIVE: https://t.co/xndQRjWuBc#MAAElections2021 | #PrakashRaj | #ManchuVishnu pic.twitter.com/oly5MX09BA— TV9 Telugu (@TV9Telugu) October 10, 2021
