కేటీఆర్ ముఖ్యమంత్రి – ఇది చక్కటి ప్లాన్ !

ముఖ్యమంత్రి కేసీఆర్ కు తీరని కోరిక ఒక్కటే ఒక్కటి ఉంది. అదే కొడుకు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలె. ఇందుకోసం గతంలో ప్రయత్నాలు చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. అయితే ఈసారి కేసీఆర్ ఓ అద్భుతమైన ప్లాన్ వేసినట్టు సమాచారమ్. ఏకంగా కేంద్రం పెద్దలు వచ్చి మరీ.. కేటీఆర్ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే ప్లాన్ అది అంటున్నారు. ఇందులో నిజం ఉందా ? లేదా ?? అన్నది పక్కనపెడితే.. ఇది మాత్రం చక్కటి ప్లాన్ అని చెప్పవచ్చు.

కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలకు ఇష్టమే. కానీ కేసీఆర్ ఉండగా.. కేటీఆర్ అంటే కన్విన్స్ కాలేకపోతున్నారు. కేసీఆర్ లాంటి అద్భుతమైన నాయకుడు ఉండగా.. ఆయన కొడుకు ఎందుకు ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తర్వాత సీనియర్లు ఉన్నారుగా అంటూ గుసుగుతున్నరు. ఇప్పుడు వాటికి చెక్ పెట్టే అద్భుతమైన ప్లాన్ ఒకటి కేసీఆర్ కి తట్టింది. అసలు రాష్ట్రంలోనే లేకుండా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లనున్నారట. టీఆర్ఎస్ ఎన్డీఏలో కలవబోతుంది. దానికి ప్రతిఫలంగా కేసీఆర్ ని ఉపరాష్ట్రపతి చేయబోతున్నారట. దీని వలన కేసీఆర్ డబుల్ ప్రాఫిట్ దక్కనుంది. 

అదేలా ? అంటే.. కేసీఆర్ ఉప రాష్ట్రపతిగా వెఌతే.. తెలంగాణ ప్రజలకు అది గౌరవమైనది. ఆ కారణంతో కొడుకు కేసీఆర్ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టవచ్చు. ఈ వేడుకకి కేంద్ర పెద్దలు తరలి వచ్చి ఆశీర్వదిస్తారు. అప్పుడు తెలంగాణలో టీఆర్ ఎస్ కు పోటీగా తయారైన తెలంగాణ బీజేపీకి చెక్ పెట్టవచ్చు. ఇలా.. పలు ప్రయోజనాలు ఉన్న ఈ ప్లాన్ కు ఇటీవల ఢిల్లీ టూర్ లో విజయవంతంగా వర్కవుట్ అయిందని.. త్వరలోనే అమలు చేయబోతున్నట్టు సమాచారమ్. ఇదే నిజమైతే.. టీఆర్ ఎస్, బీజేపీ వేరు వేరు కాదు. ఒక్కటే అని చెప్పక తప్పదు మరీ.. !