ఓపెనింగ్ బెర్త్ ఖరారు

త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌ లో రోహిత్ శర్మతో పాటు ఎవరు ఓపెనింగ్ చేయబోతున్నారు ? ఇన్నాళ్లు కెఎల్ రాహుల్ అనుకున్నారు. కానీ కాదట. తానే ఓపెనర్. ఈ మేరకు కెప్టెన్ కోహ్లీ హామీ ఇచ్చారని యువ కెరటం ఇషాన్‌ కిషన్‌ చెప్పాడు.  ఐపీఎల్‌-14లో కొన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమైన కిషన్‌.. చివరి రెండు మ్యాచ్‌ల్లో (50, 84) చెలరేగాడు.

కొంత కాలంగా టీ20ల్లో రోహిత్‌కు తోడుగా భారత్‌ ఓపెనర్లను మార్చి మార్చి ఆడిస్తోంది. ధావన్‌ జట్టులో చోటు కోల్పోయాక కొన్ని మ్యాచ్‌ల్లో రాహుల్‌, తర్వాత కోహ్లి అతడితో కలిసి ఓపెనింగ్‌ చేశారు. అయితే కిషన్‌ మాటల్ని బట్టి చూస్తే టీ20 ప్రపంచకప్‌లో అతనే రోహిత్‌ భాగస్వామి కావచ్చనిపిస్తోంది.