సాహో లోపాలున్నా..

 ‘బాహుబలి’ క్రియేట్‌ చేసిన రికార్డ్స్‌ తర్వాత ‘సాహో’ కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. అందుకు నేనెంతో ఆనందిస్తున్నా . ముఖ్యంగా ఉత్తరాదిలో ‘సాహో’ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ సినిమాలో చిన్న లోపాలున్నా.. దాన్ని ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉత్తరాదిలో ‘సాహో’ ఆడిందని ప్రభాస్‌ అన్నారు.

ఆయన లవర్‌బాయ్‌ రోల్‌లో నటించిన ‘రాధేశ్యామ్‌’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ ఇంటర్వ్యూల్లో పాల్గొంది.

జాతకాలు, జ్యోతిష్యం.. నేను అంతగా పట్టించుకోలేదు. రాధాకృష్ణ నాకు ఈ కథ చెప్పాక.. చాలామంది తమ నిజజీవితాల్లో ఎదుర్కొన్న ఘటనలు చెప్పారు. అవన్నీ విని నేను షాకయ్యా అన్నారు ప్రభాస్‌.