అందుకే సింగిల్‌గా ఉన్నా..

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
”చాలాసార్లు ప్రేమ విషయంలో నా అంచనాలు తప్పాయి. అందుకే, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు” అని సరదాగా సమాధానం ఇచ్చారు.
ఆయన నటిస్తోన్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’.ప్రేమ, విధికి మధ్య జరిగే పోరుని తెలియజేస్తూ తెరకెక్కిన ఈ ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసిగా ప్రేరణ అనే పాత్రలో పూజాహెగ్డే సందడి చేయనున్నారు.
