మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అందుకే హత్య చేయాలనుకున్నాం

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితుడు రాఘవేంద్రరాజు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. తన వ్యాపారాలు దెబ్బతీసి, ఆర్థికంగా తనకు నష్టం చేకూర్చాడని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు.  ఈ కారణంగానే మంత్రి హత్యకు కుట్ర పన్నినట్టు నిందితుడు రాఘవేంద్రరాజు పోలీసులకు వెల్లడించారు.

మంత్రి హత్యకు కుట్ర పన్నడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా… ఈ కేసులో భాజపా నేతల హస్తం కూడా ఉందని తెరాస నేతలు ఆరోపిస్తుండగా… తెరాస ఆరోపణలు భాజపా నేతలు తిప్పికొడుతున్నారు.