కొంపముంచిన కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ

కరోనా మహమ్మారి మళ్లీ మోపయింది. దేశంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యులు మాత్రమే సెలబ్రెటీలు మరోసారి కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే కత్రినాకైఫ్, ఆదిత్య రాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్ లాంటి ప్రముఖులు తాము కరోనా బారిన పడినట్టు వెల్లడించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి షారూక్ చేరాడు. వీళ్లందరికంటే ముందే నటుడు అక్షయ్ కుమార్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.  ఈమధ్య కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి హాజరైన వారిలో చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

సినీ స్టార్స్ కరోనా బారిన పడుతుండటం తో మరోసారి సినిమా షూటింగ్స్ కు బ్రేకులు పడుతున్నాయి.  అట్లీ దర్శకత్వంలో షారూక్ చేస్తున్న సినిమా జవాన్. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్, ఫస్ట్ లుక్ రిలీజైంది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఆ ఆనందం షారూక్ కు ఎక్కువ కాలం నిలవలేదు. ఈ స్టార్ హీరో కరోనా బారిన పడ్డాడు. వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లాడు. దీంతో అతడు చేయాల్సిన జవాన్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

మరోవైపు కత్రినా ‘మేరీ క్రిస్మస్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి-కత్రినా జంటగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కత్రినా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ గా నిర్దారణ అయింది. కత్రినాకు కరోనా సోకడంతో మేరీ క్రిస్మస్ సినిమా కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది.