సీరత్ కపూర్ నయా షో

ముంబై భామ సీరత్ కపూర్ మల్టీ టాలెంటెడ్. మోడల్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ కూడా. ‘రన్ రాజా రన్’ తో తెలుగు తెరకు పరిచయం అయింది. మెరుపుతీగలా కనిపించే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ ఒక్క మాస్ మహారాజా రవితేజ తప్ప.. మరో స్టార్ హీరో ఈ బ్యూటీని పట్టించుకోలేదు.

టైగర్, టచ్ చేసి చూడు సినిమాల్లో సీరత్ హీరోయిన్ గా చేసింది. ఇవీగాక.. రాజుగారి గది 2, ఒక్క క్షణం, కోలంబస్, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా.. తదితర సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సీరత్ చేతిలో సినిమాలేమీ లేవు. అయినా.. నిరాశ పడకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. మరో అవకాశం కోసం తనలోని హాట్నెస్ ని అన్ని యాంగిల్స్ లో చూపించే పనిలో ఉంది. తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో నయా షో చేసింది.

