తమ్మూ.. సూపర్ ఉమెన్ !

అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్  (#IIFAAwards) ఫంక్షన్ లో తళుక్కున మెరిసింది మిల్కీ బ్యూటీ తమన్నా. యాక్షన్ లోకి దిగిన హాలీవుడ్ హీరోయిన్ లా దర్శనమిచ్చింది. మిల్కీ బ్యూటీ తమన్నా సూపర్ ఉమెన్ అవతారం ఎత్తింది.  రెడ్ కలర్ డ్రెస్ లో సూపర్ హాట్ గా కనిపించింది. టైట్ ఫిట్ అందాలతో మరోసారి మాయ చేసింది.

అంతేకాదు.. ఆ వెంటనే గౌను లోకి మారిపోయి.. మిల్కీ అందాలతో మెస్మరైజ్ చేసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరవడం తమ్మూ ప్రత్యేకత. హీరోయిన్ గా 17 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ డౌన్ కాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’తో పాటు గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ వెబ్ సిరీస్ లు చేస్తోంది.