లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి క్రేజ్ చూశారా ?

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది సాయి పల్లవి. హీరోయిన్లకు ఎవ్వరికి సాధ్యం కానీ క్రేజ్ సంపాదించుకుంది. దర్శకుడు సుకుమార్ చెప్పినట్టు సాయి పల్లవి లేడీ పవర్ స్టార్. ఆమె కనిపిస్తే చాలు యూత్ పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఆదివారం జరిగిన విరాటపర్వం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది. సాయి పల్లవి మాట్లాడటానికి మైక్ పట్టుకోగానే.. ఈలలు, కేకలతో వేదిక మారుమ్రోగింది. అసలు ఆమె ఏం మాట్లాడిందో కూడా ఎవ్వరికి వినపడని పరిస్థితి. అంతేకాదు.. ఈదురు గాలులతో కూడిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఫిదా పోరి కోసం ప్రేక్షకులు భారీగా తరలి వచ్చారు. తమ అభిమానం చాటుకున్నారు.

ఇక  విప్ల‌వం… ప్ర‌ణ‌యం.. రెండింటికీ ముడి పెట్టిన క‌థ ‘విరాట‌ప‌ర్వం’. వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. 3 నిమిషాల పాటు సాగిన ట్రైల‌ర్ చాలా ఎమోష‌న‌ల్ గా సాగింది. ఈ క‌థ‌తో ద‌ర్శ‌కుడు ఏం చెప్ప‌బోతున్నాడో, ట్రైల‌ర్‌లో అర్థ‌మ‌య్యేలా చూపించారు. వెన్నెల అనే అమ్మాయి.. ర‌ఘ‌న్న అనే విప్ల‌వ‌కారుడి ర‌చ‌న‌ల‌కు అభిమానిగా మారిపోతుంది. త‌న‌ని ప్రేమిస్తుంది. ‘ఒక్క‌సారైనా త‌న‌ని చూడాలి’ అని క‌ల‌లు కంటుంది. పూజ‌లు చేస్తుంది. అలాంటి అమ్మాయికి ర‌ఘ‌న్న ఎదురు ప‌డ‌తాడు. వారిద్ద‌రి మ‌ధ్య ఓ ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. ర‌ఘ‌న్న ఆలోచ‌న‌లు, ఆశ‌యాలు వేరు.. వెన్నెల జీవితం వేరు. ఈ రెండింటికీ ఎలా ముడి ప‌డింద‌న్న‌దే ఈ సినిమా.  

Lady Power Star #SaiPallavi 🔥#VirataParvamTrailer #VirataParvam
@Sai_Pallavi92 #VirataParvam pic.twitter.com/7jIS4T87e5— OTTRelease (@ott_release) June 5, 2022