భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఆదివారం టెస్టుల సంఖ్య బాగా తగ్గినా.. పాజిటివ్ కేసులు 4 వేలకు పైగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ఆదివారం 2.78 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 4,518 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందురోజు 4.13 లక్షల మందిని పరీక్షిస్తే.. 4,270 కేసులొచ్చాయి.
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.31 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు. మరోవైపు క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 25,782కు ఎగబాకింది. ఆ రేటు 0.06 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,779 మంది కోలుకోగా.. మొత్తంగా 4.26 కోట్ల(98.73 శాతం) మందికి పైగా వైరస్‌ను జయించారు
