రస్మిక.. జూన్ కవర్

హీరోయిన్ రష్మిక మందన ప్రముఖ మేగజైన్ ఫిల్మ్ ఫేర్ కవర్ పేజీపై తళుక్కున మెరిసింది. ఆరెంజ్ కలర్ జాకెట్, వైట్ కలర్ షాట్ తో హాట్ గా కనిపించింది. మునుపెన్నడూ లేని విధంగా అందాలు ఆరబోసింది.
ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో బిజీ అవుతోంది రష్మిక. అక్కడ మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ సినిమాల్లో నటిస్తోంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా యానిమల్ తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక హీరోయిన్ కాగా.. పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. రష్మిక నటించిన ఒక్క బాలీవుడ్ సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. కానీ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి ఈ బ్యూటీ చేసిన యాడ్స్ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు స్పెషల్ ఫోటో షూట్స్ తో రైసింగ్ స్టార్ ఇన్ బాలీవుడ్ అనిపించుకుంటోంది
