సాంగ్ లో పిచ్చ రొమాన్స్

వరుణ్ ధావన్, కియారా అద్వానీ, అనిల్ కపూర్, నీతూ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘జగ్ జగ్ జీయో’. ఇదో కామెడీ డ్రామా. రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టిన చిత్రబృందం..  ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేసింది. దానికి మంచి స్పందన వచ్చింది. అంతేకాదు..ఫస్ట్ సాంగ్ ను కూడా వదిలారు.

తాజాగా సినిమా నుంచి రెండో సాంగ్ #RangiSari విడుదల చేశారు. ఈ రొమాంటిక్ సాంగ్ లో వరుణ్ ధావన్ – కియారాల రొమాన్స్ హైలైట్ నిలిచింది. ముఖ్యంగా కియారా మరోసారి కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ‘జగ్ జగ్ జీయో’ ఉండనుంది. ఈ సినిమాకు జై పటేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.