రణ్ వీర్ తో సమంత రొమాన్స్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి సమంత రొమాన్స్ చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్ వీర్ తో కలిసి దిగిన ఓ ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన సామ్.. స్వీటెస్ట్ అంటూ కామెంట్ పెట్టింది. రణ్ వీర్ పై ప్రశంసలు కురిపించింది. సామ్ పోస్టును షేర్ చేసిన రణ్ వీర్ ఆమె పై పొగడ్తలు కుపించారు. వీరిద్దరు పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ సమంత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రాజ్ & డీకే డైరెక్షన్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు బాలీవుడ్ నుంచి వచ్చిన ప్రతి యాడ్ లో నటిస్తోంది. ఇలా సినిమాల కంటే ముందే బాలీవుడ్ హీరోలతో కలిసి నటిస్తోంది. భవిష్యత్ లో రణ్ వీర్ తో సమంత కలిసి నటించే అవకాశాలు లేకపోలేవు.