నయన్ పెళ్లి.. కొన్ని సీక్రెట్స్

సినీ స్టార్స్ సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లి డేట్ చెప్పకుండా, ఎవరికి తెలియకుండా ఫారిన్ చెక్కేసి.. కుటుంబ వేడుకగా పెళ్లి తంతు కానిచ్చేస్తున్నారు. కత్రినా కైఫ్, అలియా భట్.. పెళ్లిళ్లు ఇలాగే జరిగాయి. అయితే వీరితో పోలిస్తే సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార బెటర్ అని చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ పెళ్లి వేదిక చెప్పేసింది. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన నయన్ ఆమె ప్రియుడు విగ్నేష్.. తిరుపతిలోనే మా పెళ్లి అని చెప్పేశారు. దగ్గరుండి వివాహ వేడుకను ఎంపిక చేసుకున్నారు.

ప్రస్తుతం పెళ్లి కార్డులు పట్టుకొని అతిథులను ఆహ్వానించే పనిలో ఉన్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ ను ఆహ్వానించారు. అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులను పెళ్లికి పిలుస్తున్నారు. అయితే వీరి పెళ్లి వేదిక తెలిసినా.. పెళ్లి డేట్ తెలియదు. దీంతో నయన్-విగ్నేష్ ల ప్రతి మూమెంట్ ను అభిమానులు గమనిస్తున్నారు. మొత్తానికి.. కొన్నిసీక్రెట్ మధ్య నయన్-విగ్నేష్ పెళ్లి పనులను కొనసాగిస్తున్నారు. కొన్నేళ్లు గా ప్రేమలో ఉన్న జంట వివాహబంధంతో బహుశా.. ఈ నెలలోనే ఒక్కటి కాబోతున్నారు.

ఇక హీరోయిన్ గా నయన్ కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలు గా కొనసాగుతుంది. దర్శకుడిగా విగ్నేష్ రాణిస్తున్నారు. ఆయన తదుపరి సినిమా అజిత్ తో ఉండనుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. పెళ్లి పనులు పూర్తయిన తర్వాత ఈ సినిమా పనులని షురూ చేయనున్నారు. మరోవైపు నయన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అట్లీ దర్శకత్వంలో సినిమాలో షారుఖ్ ఖాన్ కి జంటగా కనిపించనుంది.
