ప్రియుడితో రకుల్.. అడ్డంగా దొరికిపోయింది !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో హవా చూపిస్తోంది. అక్కడ ఎనిమిది సినిమాల్లో నటిస్తోంది. వీటిలో రెండు సినిమాలు రిలీజ్ గా కాగా.. ఇంకా ఆరు సినిమాలు డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, అయాలన్, మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి, 31 అక్టోబర్ లేడీస్ నైట్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
సినిమాలే కాదు.. పర్సనల్ లైఫ్ ని బాగా ఎంజా చేస్తోంది రకుల్. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ప్రియుడు జాకీ భగ్నానితో షికారు చేస్తోంది. ఆదివారం అదే చేసింది. ప్రియుడు జాకీ భగ్నానితో కలిసి బాంద్రాలోని ఓ కేఫ్ కి వెళ్లింది. కానీ తిరిగొచ్చే టైమ్ లో దొరికిపోయింది. అక్కడే కాపు కాసిన మీడియా ప్రతినిధులు రకుల్-భగ్నానిలను తమ కెమెరాలో బంధించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. బాలీవుడ్ దర్శకుడు, రచయిత, నిర్మాత లవ్ రంజన్ పెళ్లి వేడుకలో ప్రియుడితో కలిసి సందడి చేసింది రకుల్. ఆ తర్వాత ఇన్నాళ్లకు జంటగా కనిపించింది.
