ఇంగ్లాండ్ లక్ష్యం 149 పరుగులు

కార్డిఫ్’లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు భారత్ 149 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులను మాత్రమే చేయగలిగింది.
22 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన టీమిండియాను.. రైనా(27)తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ(47) ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో ధోని(32), హార్దిక్ పాండ్య(12) చెలరేగడంతో ఆఖరి మూడు ఓవర్లలో 37 పరుగులు చేసింది. ఆథిత్య ఇంగ్లాండ్ జట్టు ముందు 149పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ 27/1 (4ఓవర్లు)తో ఆటను కొనసాగిస్తోంది.
