5జీ ప్రయోగం సక్సెస్

5జీ ప్రయోగం విజయవంతం అయ్యింది. దీంతో వందరెట్లు వేగం సాధ్యం కానుంది. 4జీ కంటే కనీసం 20 రెట్ల వేగంతో 5జీ రానుంది. ఈ మేరకు సంస్థ-ప్లమ్, ససెక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన ప్రయోగాలు ఫలించాయి.
5జీతో ఒక గిగాబైట్ పెర్ సెకండ్(1 జీబీపీఎస్=1000 ఎంబీపీఎస్) వేగంతో అంతర్జాలాన్ని అందించవచ్చు. 2020 నాటికి అమెరికా, యూకేలో ఈ సాంకేతికతను అమలులోనికి తీసుకురానున్నారు. 5జీ సాంకేతికత విప్లవాత్మక మార్పులకు కారణం కానుంది. 4జీతో పోలిస్తే 5జీ అందించడానికి వ్యయం కూడా తక్కువే అవుతుందట. భవిష్యత్తులో డ్రైవర్‌రహిత కార్లు, వాస్తవిక కాల్పనికత, ఇ-ఆరోగ్యం తదితర ఎన్నో అనువర్తనాలకు 5జీ ఉపయోగపడనుంది.
