‘రంగస్థలం’ 100రోజుల వేడుక ఎప్పుడు.. ఎక్కడ ?

సినిమా ఫలితం ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ తో తేలిపోతుంది. ఒకప్పటిలా 50డేస్, 100డేస్.. ఆడే సినిమాలు కనిపించడం లేదు. కథ-కథనాలు బలంగా ఉంటే ఈరోజుల్లో వందరోజుల పండగ చేసుకోవచ్చని రామ్ చరణ్ ‘రంగస్థలం’ రుజువు చేసింది. సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్ ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా నాన్ బాహుబలి రికార్దులన్నీ బద్దలు కొట్టింది. గురువారం (జులై 6) ‘రంగస్థలం’ వందరోజులని పూర్తి చేసుకొంది.

15 సెంటర్లలో ‘రంగస్థలం’ 100 రోజులని పూర్తి చేసుకొంది. ఈ విషయాన్ని తెలుపుతూ మైత్రీ మూవీస్ 100 డేస్ పోస్టర్ ని విడుదల చేసింది. అంతేకాదు.. ‘రంగస్థలం’ వంద రోజుల వేడుకని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఈ నెల 9న హైదరాబాద్ లో 100 రోజుల వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి, బయ్యర్లకు 100డేస్ షీల్ట్ ని బహూకరించనున్నారు.