పవన్’నే విడాకులు అడిగారు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఉంది.. ఆయన మాజీ భార్య రేణు దేశాయ్. వీరిద్దరు విడిపోయి చాలాకాలం అవుతుంది. పవన్ తో విడిపోయాక కూడా ఆయనపై ప్రేమ, గౌరవాన్ని వ్యక్తపరుస్తూ వస్తోంది రేణు. ఐతే, ఇప్పుడు రేణు రెండో పెళ్లికి రెడీ అయ్యింది. ఇప్పటికే నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో రేణు పవన్ గురించి ఇన్నాళ్లు చెప్పకుండా దాచిపెట్టిన సీక్రెట్స్ ని రిలీవ్ చేసే పనిలో పడినట్టు కనిపిస్తోంది.
రేణు రెండో పెళ్లి చేసుకోవడం పవన్ అభిమానులకు ఇష్టం లేదు. దీంతో ఇన్నాళ్లు ప్రేమగా వదినమ్మా అని పిలుచుకొనే రేణు టార్గెట్ చేయడం ప్రారంభించారు. రేణు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఇప్పటికీ రేణు వర్సెస్ పవన్ ఫ్యాన్స్ ఏపీసోడ్ కొనసాగుతోంది. ఆ భయంతోనే రేణు కాబోయే భర్త వివరాలని కూడా బయటపెట్టడం లేదు. పెళ్లి తర్వాతే ఆయన వివరాలు చెబుతా అంటోంది. ఇకపై తనపై దాడికి దిగిన పవన్ ఫ్యాన్స్ కు గట్టి హెచ్చరికలే చేసింది. తాను నోరు తెరిస్తే పవన్ పరువు మంటలుస్తుందని హెచ్చరించింది.
పవన్ తో విడిపోయి ఇన్నాళ్లయినా.. దానికి గల కారణాలని ఎప్పుడు, ఎక్కడ చెప్పలేదు. ఐతే, ఇటీవల తన పర్సనల్ యుట్యూబ్ చానల్‌లో రిలీజ్ చేసిన ఇంటర్య్వూలో పవన్ తో విడాకుల విషయంపై స్పందించింది. పవన్ నే విడాకులు కావాలని ఆడిగారని తెలిపింది. చూస్తుంటే.. పవన్-రేణు ల విడాకుల వెనక షాకింగ్ విషయాలు దాగి ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని రేణు బయటపెట్టి పవన్ పరువు తీసేలా ఉందని పవన్ ఫ్యాన్స్ కు భయం పట్టుకొంది.
