గ్రేట్ : దేవిశ్రీ ప్రసాద్ దర్శకత్వంలో సుకుమార్

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడు డైరెక్టర్ గా మారాడు ? దర్శకుడు సుకుమార్ ఎప్పుడు యాక్టర్ గా మారాడు ?? అనుకొంటున్నారా.. ! ఎవ్వరు ఎవరిలా మారలేదు. కానీ, దేవిశ్రీ ప్రసాద్ దర్శకత్వంలో సుకుమార్ నటించింది నిజమే. కాకపోతే అది సినిమా కోసం కాదు. జస్ట్ ఒక ప్రోమో వీడియోలో మాత్రమే.

సినిమాలకు సంగీతం అందించడంతో పాటు.. సంగీత కచేరీలు నిర్వహిస్తుంటాడు దేవిశ్రీ. ఇందుకోసం ప్రపంచ యాత్రలు చేస్తుంటాడు. అతను వచ్చే నెలలో అమెరికాలో మ్యూజికల్ కన్సర్ట్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ఓ ప్రోమో వీడియో రెడీ చేశాడు. దీనికి దేవిశ్రీ నే దర్శకుడు. ఇందులో సుకుమార్ నటించాడు.

ఈ ప్రోమోను ఈ (శనివారం) సాయత్రం హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఆగస్టు 11 నుంచి సెప్టెంబరు 16 వరకు అమెరికాలోని ఆరు నగరాల్లో ఈ కన్సర్ట్ నిర్వహించబోతుండటం విశేషం. మరీ.. ఈ ప్రోమోలో దేవిశ్రీ డైరెక్షన్, సుకుమార్ నటన ఏ రేంజ్ లో ఉందో చూడాలి.