ప్రకాష్ రాజ్’తో అనుపమకు గొడవ.. !

విలక్షణ నటుడు ప్రకాష్ రాజు, యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ల మధ్య గొడవ జరిగినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. రామ్ – అనుపమ జంటగా ‘హలో గురూ ప్రేమకోసమే’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ అనుపమ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం తండ్రీ-కూతుళ్ల మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఐతే, ఓ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రకాష్ రాజ్- అనుపమల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది.

ఆ సీన్ ఇలాచేస్తే బాగుంటుందని అనుపమకు ప్రకాష్ రాజ్ సూచించారట. ఐతే, తనకు ఆ సీన్లో ఎలా నటించాలో తెలుసని.. మీరు చెప్పనవసరం లేదని…అనుపమ మొహం మీదే చెప్పినట్టు సమాచారమ్. ప్రకాష్ రాజ్ మాటలతో మనస్తాపం చెందిన అనుపమ కన్నీళ్లు పెట్టుకుందట. ఈ వివాదంలో అనుపమ తప్పు లేదని చెబుతున్నారు. గతంలోనూ ఆగడు, నా పేరు సూర్య సమయంలోనూ ప్రకాష్ రాజు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కొన్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి పనితో అనుపమని ఏడిపించినట్టు సమాచారమ్.