నాలుగు రూపాయలకే ఎల్ఈడీ టీవీ, స్మార్ట్ ఫోన్…!!

కేవలం నాలుగు రూపాయలకే 55 అంగుళాల ఎల్ఈడీ టీవీ, స్మార్ట్‌ఫోన్, బాడీ కంపోజిషన్ స్కేల్ అందిపుచ్చుకోవచ్చు. అదేంటి నాలుగు రూపాయలకు కనీసం చాక్లెట్ కూడా రాదు మరి ఎల్ఈడీ టీవీ, స్మార్ట్ ఫోన్ ఏంటి అనుకుంటున్నారా. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమి నాలుగవ వార్షికోవత్సవం సందర్భంగా ఈ మెగా సెల్ నిర్వహిస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఇండియన్ మార్కెట్లో రెడ్మీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ కస్టమర్లకు చేరువైన బ్రాండ్‌గా ఎంఐని చెప్పుకుంటారు. షియోమి రెడ్మీ భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టి జూలై 10నాటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుంది.
నాలుగేళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఎంఐ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఇందులో నాలుగు రూపాయల సేల్ కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ ఆఫర్లో కేవలం నాలుగు రూపాయలకే 55 అంగుళాల ఎల్ఈడీ టీవీతో పాటు రెడ్మీ వై1 స్మార్ట్‌ఫోన్, ఎంఐ బాడీ కంపోజిషన్ స్కేల్లను అందిస్తామంటోంది. ఈ నెల 10 నుంచి 12 వరకు ఈ సేల్ కొనసాగనుంది. కస్టమర్లు కూడా నాలుగు రూపాయల సేల్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు..
