డైలాగ్స్ లీకయ్యాయ్… పుష్ప !

సుకుమార్ – అల్లుఅర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’ సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. ఇప్పుడీ.. పుష్ప సీక్వెల్ పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే పుష్ప-2 డైలాగ్స్ లీకయ్యాయంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొన్ని డైలాగులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. “అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే?.. పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం.” అనే డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది కాకుండా మరో డైలాగ్ కూడా చక్కర్లు కొడుతోంది. “వాళ్లు గొర్రెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొర్రెల్ని తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను” అనే సంభాషణ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.
