హిందువుగా గర్విస్తున్నా

హిందువుగా గర్విస్తున్నా అన్నారు బ్రిటన్ ప్రధాని ప్రధానమంత్రి రిషి సునాక్‌. జీ20 సదస్సులో (#G20Summit) పాల్గొనేందుకు భారత్‌ చేరుకున్న ఆయన.. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హిందువుగా నేను గర్విస్తున్నా. అలాగే ఉన్నాను. ఆలయాలకు వెళ్తాను. ఇటీవలే రక్షాబంధన్‌ చేసుకున్నామని చెప్పారు. భారత్‌కు రావడం వ్యక్తిగతంగా నాకెంతో ప్రత్యేకమైన విషయం. నా కుటుంబీకులకు చెందిన భారత్‌ అంటే నాకు అమితమైన ప్రేమ. యూకే ప్రధాని బాధ్యతల్లో ఇక్కడకు వచ్చాను. భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పచుకునే మార్గాలు కనుగొనడం, ఇక్కడ నిర్వహిస్తోన్న జీ20 సదస్సును విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. సరైన సమయంలో సరైన దేశం జీ20 సదస్సు నిర్వహిస్తోందంటూ భారత్‌ను ప్రశంసించారు.

ఇక “ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు” (One Earth, One Family, One Future)’’ అనే థీమ్ తో జీ 20 సదస్సు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల అధినేతలతో జరగనున్న ద్వైపాక్షిక సమావేశాలు ఫలవంతం అవుతాయన్న ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ మిషన్‌ను అనుకరిద్దామని ప్రధాని మోడీ అన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారత, ప్రపంచ శాంతి కోసం జీ-20 దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.

#WATCH | G-20 in India: On his connect with Hinduism, UK PM Rishi Sunak to ANI says, “I’m a proud Hindu, and that’s how I was raised. That’s how I am. Hopefully, I can visit a Mandir while I’m here for the next couple of days. We just had Raksha Bandhan, so from my sister and my… pic.twitter.com/U5RLdZX3vz— ANI (@ANI) September 8, 2023