మహేష్ లుక్ మార్చేశారు

సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ మారిపోయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ చిత్రంగా ‘మహర్షి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ కొత్త లుక్ లోకి మారిపోయాడు. గెడ్డం లుక్ లోకి వచ్చాడు. ఆ లుక్ తోనే ‘మహర్షి’ ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పుడీ లుక్ ని మొత్తం మార్చేశారు. మహేష్ కు గెడ్డెం తీసేసి.. నీట్’గా తయారు చేశారు. అలాగని రీ-షూట్స్ లాంటివి ఉంటాయని భయపడాల్సిన పనేం లేదు.
‘మహర్షి’లో మహేష్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడట. కాలేజీ స్టూడెంట్ గా, ఓ అమెరికన్ కంపెనీ సీఈవోగా, రైతు పాత్రల్లో అలరిస్టాడట. ఇందులో కాలేజీ నేపథ్యంలో వచ్చే ఏపీసోడ్ లో మాత్రమే మహేష్ గెడ్డెం లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పుడీ ఏపీసోడ్ షూటింగ్ మొత్తం పూర్తయింది. తర్వాత షెడ్యూల్ కోసం చిత్రబృందం అమెరికా వెళ్లనుంది. ఈ ఏపీసోడ్ లో మహేష్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఇందుకోసం మహేష్ కు గెడ్డెం తీసేసి నీట్ గా రెడీ చేశారని తెలిసింది.
ఆ లుక్ లో మహేష్ ఎలా ఉండబోతున్నాడు అనేది తెలుసుకొనేందుకు ప్రిన్స్ ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. బహుశా.. రెండో టీజర్ లో మహేష్ కొత్త లుక్ ని చూపిస్తారేమో.. ! ఇక, యుఎస్ నుంచి తిరిగొచ్చాక.. మహేష్ మరో లుక్ లోకి మారనున్నాడు. అదే రైతు పాత్ర. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. కామెడీ హీరో అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడి పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్’లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు
