అసలు ‘మహానుభావుడు’ అఖిల్

మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మహానుభావుడు’ సూపర్ హిట్’గా నిలిచిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేసే మారుతి.. అతి శుభ్రత కాన్సెప్ట్ తో ‘మహానుభావుడు’ని తీసుకొచ్చారు. అది బాగా వర్కవుట్ అయ్యింది. ఐతే, మహానుభావుడు కోసం మారుతి ముందుగా అఖిల్ ని అనుకొన్నారట. ఆ సమయంలో అఖిల్ ‘హలో’ సినిమాతో బిజీగా ఉండటంతో.. శర్వాని మహానుభావుడికి చేశారట. ప్రస్తుతం మారుతి నాగ చైతన్యతో ‘శైలిజా రెడ్డి అల్లుడు’ తెరకెక్కించారు.
వచ్చే శుక్రవారమే ‘శైలాజారెడ్డి అల్లుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇగో కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమిది. ఇగో కలిగిన అత్త శైలాజారెడ్డి పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, ఆమె కూతురుగా అను ఇమ్మాన్యూయేల్ కనిపించనుంది. ఈమెకి ఇగో ఎక్కువేనట. ఈ ఇద్దరి మధ్య నగిలిపోతూ.. అనుని పెళ్లిచేసుకొనే అల్లుడు పాత్రలో చైతూ కనిపించబోతున్నాడు. ఇక, ఈ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న సినిమాకి మారుతి దర్శకత్వం వహించనున్నారు.
దీంతోపాటు మహేష్ సోదరి మంజుల నిర్మించే సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుంది. గీత గోవిందంతో స్టార్ హీరోల లిస్టులో చేరిపోయిన విజయ్ దేవరకొండతో మారుతి ఓ సినిమా చేయనున్నాడట. ఐతే, అదెప్పుడు కుదురుతుంది.. ? అనేది మాత్రం చెప్పలేను అంటున్నాడు. ‘రంగస్థలం’ సినిమా మాదిరిగా 1980 నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి మారుతి ప్లాన్ చేసుకొన్నాడట.
