బిగ్ బాస్ హౌస్’లో సిల్లీ ఫెలోస్.. కనిపించేది నేడే !


కామెడీ హీరోలు సునీల్, అల్లరి నరేష్ లు ‘సిల్లీ ఫెలోస్’ అనిపించుకొన్నారు. వీరిద్దరు కలిసి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో
నటించిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోకపోయినా.. ప్రేక్షకులకి బాగానే వినోదాన్ని పంచుతున్నారు సిల్లీ ఫెలోస్. ఇప్పుడీ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు సునీల్, నరేష్ బిగ్ బాస్ హౌస్’లో సందడి చేయనున్నారు. ఆ ఏపీసోడ్ ఈ (ఆదివారం) రాత్రి ప్రసారం కానుంది.

దీనికి సంబంధించిన ప్రోమో టీజర్ ని ‘స్టార్ మా’ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అల్లరి నరేష్, నాని బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలోనూ వీరిద్దరు అరేయ్.. ఓరేయ్ అనుకోవడం ఆకట్టుకొంది. ప్రోమోలోనే ఫుల్లుగా నవ్వించేశారు. దీంతో.. ఈ రాత్రి షో అదిరిపోయేలా కనబడుతోంది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ హౌస్’లో సిల్లీ ఫెలోస్ చేసే సందడి ని చూడబోతున్నాం. అప్పటి వరకు ఈ ప్రోమో టీజర్ ని చూసి ఎంజాయ్ చేయండీ.. !